భారతదేశం, జనవరి 11 -- బాక్సాఫీస్ కింగ్ గా, మెగాస్టార్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అంటూ థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నారు. చిరుకు సంక్రాంతి అంటే సెంటిమెంట్. మరి ఆయన కెరీర్ ఏ సినిమాలు సంక్రాంతికి వచ్చాయో, వాటి రిజల్ట్ ఏంటో ఇక్కడ చూసేద్దాం.

సంక్రాంతి 2026కు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు చిరంజీవి రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో నయనతార హీరోయిన్. ట్రైలర్ చూస్తే సంక్రాంతికి చిరు ఖాతాలో మరో హిట్ పడటం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినీ కెరీర్ కు గ్యాప్ ఇచ్చారు. కొంత కాల...