భారతదేశం, జనవరి 15 -- ప్రతి ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ సంవత్సరం 2026 సంక్రాంతికి అయితే ఏకంగా ఆరుగురు హీరోలతో ఐదు సినిమాలు అలరించేందుకు వచ్చాయి.

ఇప్పుడు ఆ సంక్రాంతి సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. చిరంజీవి నుంచి శర్వానంద్ వరకు గల ఐదు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడెక్కడో ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో రెండు సినిమాలు ఒకే ఓటీటీలో రిలీజ్ కావడం విశేషం.

సంక్రాంతి 2026 బాక్సాఫీస్ బరిలో దిగిన మొదటి సినిమా ది రాజా సాబ్. రెబల్ స్టార్ ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ది రాజా సాబ్ జనవరి 12న థియేటర్లలో విడుదల అయింది.

వింటేజ్ ప్రభాస్‌ను చూశామని ఫ్యాన్స్ మురిసిపోతుంటే స్టోర...