Hyderabad, సెప్టెంబర్ 21 -- లేటెస్ట్‌గా తెలుగులో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సినిమా మిరాయ్. తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.

మైథలాజికల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిన మిరాయ్ సినిమాలో శ్రీయ సరన్, జగపతి బాబు, జయరాం వంటి వారు కీలక పాత్రలు పోషించగా బ్యూటిఫుల్ రితికా నాయక్ హీరోయిన్‌గా చేసింది. అయితే, మిరాయ్ మూవీ రిలీజ్‌కు పాల్గొన్న మీడియా ప్రమోషన్స్‌లో తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ విశెషాలు, ఫ్యూచర్ సినిమాల గురించి చెప్పాడు.

-చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలా మంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

-కరణ్ జోహార్ గారు ఈ సిని...