భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను, పరిణితి కలిగిన కథలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. తాజాగా అతడు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక ఎమోషనల్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు వీరి కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి ఒక పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. తప్పిపోయిన తన కూతురి కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం అని సమాచారం. అయితే చిరు కూతురి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టిని (Krithi Shetty) ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడం, ఆమె వయసు క...