భారతదేశం, నవంబర్ 26 -- నటి కీర్తి సురేష్ తన రాబోయే మూవీ 'రివాల్వర్ రీటా' ప్రమోషన్ కోసం బుధవారం (నవంబర్ 26) హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో తమిళ నటుడు విజయ్‌ని తన అభిమాన డ్యాన్సర్‌గా పేర్కొనడం ద్వారా చిరంజీవిని 'అవమానించినట్లు' ఆమెను ఒక రిపోర్టర్ ప్రశ్న అడిగారు. దీనివల్ల చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పడంతో ఆమె క్షమాపణ అడిగింది. అయితే విజయ్ డ్యాన్స్ ఇష్టమని తాను చిరు సర్ తోనూ చెప్పానని ఆమె స్పష్టం చేసింది.

రివాల్వర్ రీటా మూవీ ప్రమోషన్లలో భాగంగా కీర్తి సురేష్ ప్రెస్ మీట్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా కీర్తి ఒక ఇంటర్వ్యూలో తన అభిమాన డ్యాన్సర్‌గా విజయ్‌ను పేర్కొన్నారని రిపోర్టర్ ప్రస్తావించారు. చిరంజీవి అభిమానులు దీనిపై మండిపడ్డారని, తమ అభిమాన నటుడిని 'అవమానించినట్లు'గా భావించారని అన్నారు. మరి మీరు ఎందుకు అలా...