భారతదేశం, డిసెంబర్ 14 -- టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతికి తన సినిమాతో వస్తున్నాడు. ఈసారి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు మూవీతో రెడీ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తనదైన స్టైల్లో స్పందించాడు.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తనను పిండేస్తున్నాడని చిరంజీవి చేసిన కామెంట్స్ పై అనిల్ రావిపూడి స్పందించాడు.

"మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో చిరంజీవి గారు మాట్లాడుతూ.. పిండేస్తున్నాడమ్మ అబ్బాయి అని అన్నారు కదా. వాడటం అంటే ఏదీ వదల్లేదు నేను. అది ఆయనదే. ఆయన స్ట్రెంత్ అన్నారు కదా. ఎ టు జెడ్ ఎంతయితే అంత చిరంజీవిగారిని ఎలా చూస్తే ఆడియెన్స్ లైక్ చేస్తారో అలా చూపించడానికి నా 100 శ...