Hyderabad, మే 1 -- హీరో నాని నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ 3. నానికి జోడీగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా ఇవాళ (మే 1) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నాడు హీరో నాని.

-మిక్కి జే మేయర్ మంచి క్రాఫ్ట్ మ్యాన్, ఇప్పటివరకు మంచి ఫీల్ గుడ్ సినిమాలు చేశారు. ఆయన ఎప్పుడు కూడా థ్రిల్లర్ చేయలేదు. ఒకవేళ ఆయన థ్రిల్లర్ చేస్తే ఆ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన్ని తీసుకోవడం జరిగింది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కు ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

-ఈ సినిమాలో ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంటుంది . శ్రీనిధి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఆ క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఎక్కువ విషయాలు రివీల్ చేయకూడదు. తన సొంత సినిమా అన్న...