భారతదేశం, మే 17 -- మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎక్కువ శాతం కమర్షియల్ చిత్రాలే చేశారు. రుద్రవీణ, ఆపద్భాందవుడు లాంటి కొన్ని సినిమాలు మధ్యమధ్యలో చేసినా.. ఎక్కువగా కమర్షియల్ రూల్ పాటించారు. దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. రీ-ఎంట్రీలోనూ కమర్షియల్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు చిరు. అయితే, ఈ విషయంపై రైటర్ కొనా వెంకట్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. చిరంజీవి ఏమనుకుంటున్నారో వెల్లడించారు.

మాస్ హీరోగానే కమర్షియల్ సినిమాలు చేసి తనకు బోర్ కొట్టిందని, విభిన్నమైన చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్టు చిరంజీవి తనతో అన్నారని గలాటా ప్లస్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోన చెప్పారు. "ఇలాంటి డ్రమాటిక్ ప్లాష్‍బ్యాక్ ఉండే సినిమాలు ఇంకెంత కాలం చేయాలని ఆయన (చిరంజీవి) కూడా అనుకుంటున్నారు. ఇలాంటి చిత్రాలు ఇక చేయలేనని ఆయన అన్నారు. ఓ సాదారణ పాత్రన...