భారతదేశం, నవంబర్ 28 -- మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ మూవీ మన శంకర వరప్రసాద్ గారుతో ఈ సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. అనిల్ రావిపూడి డైరెక్షన్ తో నయనతార కూడా నటిస్తున్న ఈ సినిమా కోసం చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యువ హీరోలతో సమానంగా అతడు భారీ మొత్తం అందుకుంటున్నాడు.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవికి ఏకంగా రూ.72 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది చాలా ఎక్కవే అని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ఓ మోస్తరు బడ్జెట్ సినిమా కోసం ఇంత భారీ రెమ్యునరేషన్ ఊహకందనిదే. మొత్తం మూవీ బడ్జెటే సాధారణంగా ఈ స్థాయిలో ఉంటుంది.

అంతేకాకుండా చిరు కూడా లాభాల్లో వాటా తీసుకుంటూ ఉంటాడు. కానీ ఈ మన శంకరవరప్రసాద్ గారు కోసం ముందే ఇంత భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకో...