Hyderabad, జూలై 5 -- ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌​లతో సాగే సీరియళ్లను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌​ను అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునే కథ, కథనం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు అందిస్తున్న సరికొత్త ధారావాహిక 'ఆటో విజయశాంతి'.

కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న 'ఆటో విజయశాంతి' జులై 7న ప్రారంభం కానుంది. అంటే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. జీ తెలుగులో జులై 7న టీవీ ప్రీమియర్ కానున్న ఆటో విజయశాంతి సీరియల్ రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

ఆటో విజయశాంతి సీరియల్​ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కింది. చెల్లెళ్లను ప్రేమగా పెంచుకునే రజినీకాంత్ ​(అలీ రెజా) ఓ ప్రమాదంలో చనిపోవడంతో కథ మొదలవుతుంది. అన్న బాధ్యత...