భారతదేశం, జూలై 5 -- సీనియర్ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ మీద ఫిష్ వెంకట్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కు సాయం చేయాలని ఆయన భార్య, కూతురు వేడుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు స్పందించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారని వెంకట్ కూతురు చెప్పింది.

ఫిష్ వెంకట్ కు కిడ్నీ ఇచ్చేందుకు డోనర్ దొరకడం లేదు. మ్యాచ్ అయ్యే కిడ్నీ కోసం ఫ్యామిలీ సభ్యులు వెతుకుతున్నారు. వివిధ కారణాల వల్ల కుటుంబంలో ఎవరూ కిడ్నీ దానం చేయలేకపోతున్నారని, దాత దొరకడం లేదని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి చెప్పింది. ''చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన...