Hyderabad, జూలై 18 -- కుటుంబ, కామెడీ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నయనతారలతో ఓ సినిమా తీస్తున్న విషయం తెలుసు కదా. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

కేరళలోని అలప్పుళలలో చిరంజీవి, నయనతార మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ చిన్న బోట్ లో ఈ ఇద్దరూ పక్కపక్కనే పెళ్లి దుస్తుల్లో కూర్చొని ఉండటం ఆ వీడియోలో కనిపించింది. ఓ బోట్ లో నుంచి వీళ్లు దిగి మరో చిన్న పడవ మీదికి వెళ్లడం, తర్వాత దానిపై వెళ్తూ షూటింగ్ లో పాల్గొనడం ఈ వీడియోలో చూడొచ్చు. చిరంజీవి, నయనతారపై ఈ సీన్ ఎలా తీస్తున్నారో చూడండంటూ ఒక యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేశారు.

దూరం నుంచి తీసిన ఈ వీడియోలో రెండు పడవలకు బంతి పూలను అలంకరించి, అందులో షూటింగ్ జరిపినట్లు కనిప...