Hyderabad, ఆగస్టు 22 -- మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నారు. విశ్వంభర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇవాళ (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులు, హీరోలతోపాటు మూవీ మేకర్స్ విషెస్ తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇదివరకే చిరు పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే అంటే ఆగస్ట్ 21న సాయంత్రం విశ్వంభర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా నేడు మెగా 157 సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్‌గా అనిల్ రావిపూడి, చిరంజీవి సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

చిరు, అనిల్ కాంబినేషన్‌లో వస్తున్న మెగా 157 సినిమాకు 'మన శంకరవరప్రసాద్ గారు' అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది రియల్ లైఫ్‌లో చిరంజీవి పేరు ...