Hyderabad, మే 23 -- టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ లో సంక్రాంతి మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మెగా 157 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శుక్రవారమే (మే 23) ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా తక్కువ రెమ్యునరేషన్ కే సినిమా అంగీకరించినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

చిరంజీవి 157వ సినిమాలో నయనతారకే అవకాశం ఇవ్వాలని మొదట భావించారు. అయితే ఆమె ఏకంగా రూ.12 కోట్లు డిమాండ్ చేయడంతో ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారు. మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఈ సమయంలో నయన్ టీమ్ మళ్లీ వాళ్లను సంప్రదించింది.

ఇందులో తన పాత్ర ఆమెకు బాగా నచ్చడం, అది కూడా తక్కువ సమయం పాటే ఉండటంతో కేవలం రూ.6 కోట్లకే చేయడానికి ఆమె అంగీకరించిందని ఓటీటీప్లే రిపోర్టు తెలి...