భారతదేశం, జనవరి 12 -- మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి సంబరాల్లో మునిగిపోయారు. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. చేసుకోకుండా ఎందుకు ఉంటారు మరి? చిరంజీవి హీరోగా అనిల్ దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రీమియర్, పెయిడ్ షోలు చూసిన ఆడియన్స్ బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి ఫస్ట్ టైమ్ చేసిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతి 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 12) రిలీజైంది. అంతకంటే ముందే రాత్రి ప్రీమియర్, పెయిడ్ షోలు పడ్డాయి. వీటిని చూసిన జనాలు సినిమా అదిరిపోయిందని అంటున్నారు. దీంతో చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఇది పండగ సినిమా ...