Hyderabad, అక్టోబర్ 2 -- కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. కాంతార 2 ఇవాళ (అక్టోబర్ 2) థియేట్రికల్ రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఇదివరకే కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంతార చిత్ర బృందానికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన సోదరులందరికీ నమస్కారాలు" అని స్పీచ్ ప్రారంభించాడు.

"మా అమ్మమ్మ నాకు చిన్నప్పటి నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు నిజంగా అలా జరు...