భారతదేశం, జనవరి 14 -- సినిమా ఇండస్ట్రీలో స్టార్ల మధ్య స్నేహం ఉండటం సహజమే. కానీ, చిన్ననాటి నుంచే ప్రాణ మిత్రులుగా ఉండటం చాలా అరుదు. అలాంటి ఒక స్వచ్ఛమైన స్నేహం గురించి మలయాళ భామ మాళవిక మోహనన్ ముచ్చటించారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె అయిన మాళవిక మోహనన్ ఫైట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ కుమారుడైన విక్కీ కౌశల్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో స్టార్ హీరోపై మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

"విక్కీ కౌశల్ నా పాత స్నేహితుడు మాత్రమే కాదు, నా జీవితంలో, ఇండస్ట్రీలో మొదటి స్నేహితుడు కూడా" అని మాళవిక ఎంతో గర్వంగా చెప్పారు. ముంబైలో ఇరుగుపొరుగున పెరిగిన వీరు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఆడుకునేవారని తెలిపింది మాళవిక.

"నేను ఏడాది పాపగా ఉన్నప్పటి నుంచి నాకు విక్కీ తెలుసు. అప్పట్లో వి...