భారతదేశం, అక్టోబర్ 31 -- చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. ఈ హత్య ఘటన 2015 నవంబరు 17వ తేదీన చోటు చేసుకుంది.

అప్పటి చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, మోహన్‌ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న చంద్రశేఖర్, జీఎస్ వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....