భారతదేశం, నవంబర్ 5 -- చిత్తూరు జిల్లాలోని శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ (సీటమ్స్)లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

తీవ్రగాయాలైన అతడిని ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన తరువాత. మృతుడి కుటుంబ సభ్యులు కాలేజీకి చేరుకున్నారు. సూసైడ్ గురించి కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి రావడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణ సమయంలో చిత్తూరు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు మృతుడి కుటుంబ సభ్యులను దూరంగా నెట్టడంతో మరింత గందరగోళం నెలకొంది.

తమ కుమారుడి మరణానికి కారణమైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన...