Telangana, జూన్ 20 -- వరంగల్ కాంగ్రెస్ లో నేతల మధ్య గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా మారాయి. అంతేకాదు. కొండా మురళీ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పలువురు నేతలు. ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పార్టీ ఊరుకోదంటూ సదరు నేతలు. కొండాను హెచ్చరించారు. సీనియర్ నాయకులు అనే ఇంకితం లేకుండా ఏది పడితే అది మాట్లాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం వరంగల్‌ నగరంలోని పోచమ్మ మైదాన్‌లో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇందులో పార్టీ నేత కొండా మురళీ మాట్లాడుతూ. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో పదవులు అనుభవించారని. ఆ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఆ తర్...