Hyderabad, మే 11 -- హీరో శ్రీ విష్ణు, కమెడియన్ వెన్నెల కిశోర్ తమదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సినిమా సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించిన సింగిల్ మే 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

థియేటర్లలో విడుదలైన సింగిల్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దాంతో తొలి రోజున వరల్డ్ వైడ్‌గా 4 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది సింగిల్ మూవీ. సక్సెస్‌ఫుల్‌గా సింగిల్ మూవీ దూసుకుపోతున్న నేపథ్యంలో విలేకరుల సమావేశంలో కమెడియన్ వెన్నెల కిశోర్ సినీ విశేషాలు పంచుకున్నాడు.

-మనం చికెన్ బిర్యానీ తిన్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ వస్తుంది. అది బిర్యానీకి ఒక టేస్ట్‌ని తీసుకొచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలా...