భారతదేశం, నవంబర్ 8 -- బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. శుక్రవారం (నవంబర్ 7) ఈ లిరికల్ సాంగ్ విడుదలైంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ పాటతో రామ్ చరణ్.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్‌లను అధిగమించాడు.

పెద్ది సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'చికిరి' రికార్డు క్రియేట్ చేసింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన భారతీయ పాటగా 'చికిరి చికిరి' నిలిచింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ 'చికిరి చికిరి' పాటను భాషను మోహిత్ చౌహాన్ పాడాడు. ఇది విడుదలైన అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. దీంతో ఇది ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన, ఇష్టపడిన మ్యూజిక్ ట్రాక్స్‌లో ఒకటిగా నిలవడమే కాకుండ...