భారతదేశం, సెప్టెంబర్ 30 -- టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంత పని చేశాడా? ఇండియన్ టీమ్ కు ఆడిన అతను తన మాజీ భార్యను మోసం చేశాడా? ఇప్పుడు అతని మాజీ వైఫ్ ధనశ్రీ వర్మ చేసిన సంచలన ఆరోపణలు ఇలాగే ఉన్నాయి మరి. పెళ్లయిన రెండో నెలకే చాహల్ చీటింగ్ చేస్తున్నాడని కనిపెట్టానని ఓ రియాలిటీ షోలో ధనశ్రీ చెప్పింది.

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల అనంతరం కూడా హెడింగ్ లో నిలుస్తూనే ఉన్నారు. అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' లో పార్టిసిపేట్ చేస్తున్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ తాజాగా మాజీ భర్త చాహల్ పై సంచలన ఆరోపణలు చేసింది. వివాహం జరిగిన రెండు నెలల్లోనే అతను మోసం చేశాడని ఆరోపించింది.

షోలో ఒక ఎపిసోడ్ లో ధనశ్రీ నటి కుబ్రా సైట్ తో టిఫిన్ చేస్తూ మాట్లాడటం కనిపించింది. కుబ్రా ఆమెను.. "మీ రిలేషన్ షిప్ ముందుకు సాగదని, ఇది పొరపాటు...