భారతదేశం, నవంబర్ 27 -- నటుడు నిఖిల్ సిద్ధార్థ తన మొదటి పీరియడ్ యాక్షన్ మూవీ 'స్వయంభు' షూటింగ్‌ను ఎట్టకేలకు పూర్తి చేశాడు. రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుభవాలను అతడు 'హిందుస్థాన్ టైమ్స్‌'తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.

తన నెక్ట్స్ మూవీ స్వయంభుపై అతడు స్పందించాడు. "ఈ సంవత్సరం నా సినిమా ఎందుకు విడుదల కాలేదని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఏదో పెద్ద దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ పెద్ద విషయమే 'స్వయంభు'. రెండు సంవత్సరాల వ్యవధిలో 170 రోజులు ఈ సినిమా షూటింగ్ కోసం కేటాయించాం. అదే సమయంలో నేను 'కార్తికేయ 2'ని కేవలం 80 రోజుల్లో పూర్తి చేశాను" అని నిఖిల్ తెలిపాడు.

11వ శతాబ్దంలో కృష్ణన్ రామన్ అనే చోళ యోధుడు ఉన్నాడని నిఖిల్ చెప్పాడు. ఆ సేనాపతి గురించి విన్నప్పుడు, అతని కథన...