భారతదేశం, ఆగస్టు 27 -- ప్రఖ్యాత చాముండేశ్వరి ఆలయం ఉన్న మైసూరులోని చాముండి కొండ హిందువుల ఆస్తి మాత్రమే కాదని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఈ ప్రకటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 22న చాముండి కొండ శిఖరం వద్ద మైసూరు దసరా-2025 ఉత్సవాలను ప్రారంభించాల్సిందిగా అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముస్తాక్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఆహ్వానంపై డీకే శివకుమార్ స్పందించారు.

చాముండి కొండ, చాముండి దేవి అన్ని మతాలకు చెందినవని, ఇది హిందువుల ఆస్తి మాత్రమే కాదని శివకుమార్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు చాముండి కొండకు వెళ్లి అమ్మవారిని ఆరాధిస్తారన్నారు. ఇది వారి విశ్వాసమని చెప్పారు. చర్చిలు, జైన దేవాలయాలు, దర్గాలు, గురుద్వారాలకు వెళ్తుంటామని గుర్తుచేశారు. ముస్తాక్ ఆహ్వానంపై నిరసన పూర్తిగా రాజకీయమని ...