Hyderabad, ఆగస్టు 22 -- క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ధనశ్రీ తన నిర్ణయం గురించి.. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను ఎలా ఎదుర్కొన్నారో చెప్పింది. ఇప్పుడు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ధనశ్రీకి బహిరంగంగా మద్దతు తెలపడం విశేషం.

ఒక రెడిట్ పోస్ట్ ప్రకారం.. సూర్యకుమార్ భార్య దేవిశా హ్యూమన్స్ ఆఫ్ బాంబేతో ధనశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ స్క్రీన్‌గ్రాబ్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్ చేసింది. ఆ క్యాప్షన్‌లో "మీపై చాలా గౌరవం, ప్రేమ ఉంది" అని రాసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన ఒక యూజర్.. "ఇది చాలా బాధాకరం. తమ భార్యలను కొట్టే లేదా మోసం చేసే పురుషులపై ఇలాంటి ప్రచారం మీరు చూడలేరు. ఇలాంటి చెత్త,...