భారతదేశం, మే 10 -- తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలు కురిసే ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. శనివారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వర్షాలు కురిసే సమయంలో.. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న రెండు రోజులు కూడా బలంగా ఈదురు గాలులు ఉంటాయని హెచ్చరించింది. గాలులు ఆకస్మాత్తుగా వీచే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

అటు రుతుపవనాలు కూడా నిర్ణీత సమయం కంటే ముందే తీరాన్ని చేరుకోవచ్చని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మే నెల 27న ర...