Hyderabad, మే 5 -- వేసవికాలంలో వేడి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తాం. కాకపోతే ఏసీల్లో, కూలర్ల ముందు కూర్చోవడం, చల్లటి కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీం తినడం వంటి చేసే కంటే శరీరాన్ని చల్లబరచడానికి కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. ఇవి హైడ్రేటెడ్ గా ఉంచి అరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తాయి. మరి ఆ 9 రకాల పండ్లేమిటో తెలుసుకుందాం.

సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయ పండ్లలో రారాజు. దీనిని నేరుగా లేదా స్మూతీగానైనా చేసుకుని తినవచ్చు కూడా. వీటన్నిటి కంటే మామిడి గుజ్జుతో చేసే పుల్ల ఐస్‌ తినడం ఇంకా బెటర్. కాకపోతే ఇలా చేయడానికి తాజా మ్యాంగోలు, కొద్దిగా నూనె, నీళ్లు లేదా కొబ్బరినీళ్లు కావాల్సి ఉంటుంది. వీటిల్లో విటమిన్ ఏ, సీలు ఉండి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్య...