Hyderabad, ఏప్రిల్ 17 -- వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం వేడెక్కిపోతుంది. దీనివల్ల నీరసం, అలసట, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు మొదలయినవి తరచూ కలుగుతుంటాయి. అటువంటి సమయాల్లో శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. అలాంటి వాటిలో ఒకటి గోండ్ కటీరా షర్బత్ .

శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే శక్తివంతమైన ఔషధ పదార్థాలలో ఒకటి గోండ్ కటీరా. దీంతో తయారు చేసిన షర్బత్ వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా సహాయపడుతుంది. తియ్యగా తీపిగా, చల్లగా, అద్భుతమైన రుచి కలిగిన షర్బత్‌ను పిల్లల నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. గోండ్ కటీరా షర్బత్‌ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

వేసవిలో మన శరీరం వేడెక్కిపోతుంది. గోండ్ కటీరా తీసుకుంటే శరీరం లోపల నుంచి చల్లగా మారుతుంది. ఇది ఒక సహజ శీతలీకరణ లక్షణాలు కలిగిన ఆ...