భారతదేశం, డిసెంబర్ 11 -- తెలంగాణలోని బుధవారం నుండి ఉష్ణోగ్రత మరింత తగ్గుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)-హైదరాబాద్, ప్రైవేట్ వాతావరణ ట్రాకర్లు రాబోయే వారంలో తీవ్రమైన చలిగాలుల పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఐఎండీ హైదరాబాద్ తెలంగాణలోని పలు జిల్లాలకు చలిగాలుల హెచ్చరికను మరో రెండు రోజులు పొడిగించింది.

ఆదిలాబాద్ , కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డితో సహా అనేక ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది .

ఐఎండీ హైదరాబాద్ జారీ చేసిన తీవ్రమైన చలిగాలుల హెచ్చరిక శుక్రవారం, డిసెంబర్ 12, 2025 వరకు కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత మరికొన్ని రోజులు కూడా తీవ్రమైన చలి ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, మెదక్, ...