భారతదేశం, డిసెంబర్ 10 -- రాష్ట్రంలో చలి తీవత్రకు గజగజ వణికిపోతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు(డిసెంబర్ 11)వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంది. తెలంగాణ వెదర్ మ్యాన్...