భారతదేశం, డిసెంబర్ 5 -- చలికాలం వచ్చిందంటే చాలు.. ఆలస్యంగా నిద్రలేవడం, కాస్త బద్ధకంగా ఉండటం, ఆకలి పెరగడం వంటివి సహజం. మన శరీరం వెచ్చగా ఉండటానికి మరింత శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో చాలామంది నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీలు, ఎక్కువగా చక్కెర ఉన్న స్నాక్స్ తినడానికి మొగ్గు చూపుతారు. అయితే, చల్లని నెలల్లో మనకు మరింత బలం, తెలివైన పోషణ అవసరం కానీ, బరువైన, అస్సలు ఆరోగ్యకరం కాని ఆహారాలు కాదు. ఎందుకంటే, చలికి మన శరీరం వెచ్చగా ఉండటానికి కష్టపడుతుంది. ఇమ్యూనిటీ కాస్త బలహీనపడుతుంది. జీర్ణక్రియ కూడా మందగిస్తుంది. ఈ పరిస్థితుల్లో రుచి, వెచ్చదనం, ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన మిశ్రమం.. చిలగడదుంప చాట్.

న్యూట్రిషనిస్ట్, న్యూట్రాసీ లైఫ్‌స్టైల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రోహిణి పాటిల్ ఈ విషయం గురించి వివరిస్తూ, "ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, శరీరం వేడిని కాపాడ...