భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైన చలి ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ గజ గజ వణికిపోతుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సమయాలను సవరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తరగతులు ఉదయం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

చలి వాతావరణం కారణంగా విద్యార్థుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి ఉదయం 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు కాకుండా ఉదయం 9.40 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలు సమయాలను తక్షణమే పాటి...