భారతదేశం, డిసెంబర్ 19 -- చలికాలం వచ్చిందంటే చాలు.. బయట చల్లని గాలులు, లోపల పొడి గాలి మనల్ని పలకరిస్తాయి. ఈ వాతావరణం హాయిగా ఉన్నప్పటికీ, జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు ఇది అనువైన సమయం. సాధారణంగా మనం ఇమ్యూనిటీ అనగానే విటమిన్-సి వైపు మొగ్గు చూపుతాము. కానీ, మన రోగనిరోధక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన, తరచుగా విస్మరించే మరొక పోషకం 'జింక్'.

శ్వాసకోశ ఆరోగ్యానికి జింక్ ఒక కీలకమైన మైక్రోన్యూట్రియెంట్ అని ఇంటిగ్రేటివ్ హెల్త్ కోచ్ డాక్టర్ ప్రార్థన షా వివరిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థకు జింక్ ఒక 'ద్వారపాలకుడిలా' (Gatekeeper) పనిచేస్తుందని, శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లపై వేగంగా స్పందించి, వ్యాధి తీవ్రతను, కాలవ్యవధిని తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు.

జింక్‌తో చేకూరే 5 అద్భుత ప్రయోజనాలు:

"శరీరంలోని టీ-కణాలు (T-cells), నేచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివే...