భారతదేశం, జనవరి 7 -- సంక్రాంతి పండగ సమీపించిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. బస్ స్టాండ్లు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ రద్దీ ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దక్షిణ మద్య రైల్వే పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే విశాఖపట్నం - చర్లపల్లి రూట్ లో మరో 2 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం - చర్లపల్లి(ట్రైన్ నెంబర్ 08513) మధ్య ప్రత్యేక రైలు జనవరి 18న అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖ నుంచి రాత్రి 11 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.

ఇక చర్లపల్లి - విశాఖపట్నం (రైలు నెంబర్ 08514) మధ్య జనవరి 19వ తేదీన మరో స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు చర్లపల్లి స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.30 గ...