భారతదేశం, జనవరి 23 -- చర్లపల్లి (హైదరాబాద్) - తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ఈ సరికొత్త ట్రైన్ సేవలను ప్రారంభించారు. మొత్తం 29 స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ ఇచ్చారు. ఇందులో తెలంగాణతో పాటు ఏపీలోని పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

చర్లపల్లి (హైదరాబాద్) - తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది. ఈ రైలు ప్రతి మంగళవారం (ట్రైన్ నెంబర్ 17041) ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి (ట్రైన్ నెంబర్ 17042) గురువారం రాత్రి 11.30కు బయలుదేరి.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్. తెలంగాణలోని నల్గొండ, మ...