భారతదేశం, మే 17 -- భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతమైన కనెక్టివిటీని అందించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడలో రద్దీని తగ్గించడానికి దీన్ని అత్యాధునికంగా తీర్చిద్దారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. అలాగే ఇక్కడి నుంచి కొన్ని రైళ్లను నడుపుతున్నారు. కానీ.. ప్రయాణికులు మాత్రం అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి.

1.చర్లపల్లి రైల్వే స్టేషన్ సిటీకి దూరంగా ఉంది. స్టేషన్ నగరం వెలుపల ఉండటంతో చేరుకోవడం కష్టంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులు, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.

2.చర్లపల్లికి మెట్రో స్టేషన్లు కూడా చాలా దూరంలో ఉన్నాయి. దీంతో మెట్రోలో రావడం కూడా కష్టంగా ...