భారతదేశం, మే 26 -- చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో తీవ్ర విషాదం జరిగింది. పిల్లల కళ్లెదుటే తల్లి చనిపోయింది. రైలు బోగీ మారేందుకు యత్నించిన ఓ త్లలి.. ప్రమాదవశాత్తు రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా దొండపూడికి చెందిన మట్టల వెంకటేష్, శ్వేత దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. భర్త ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుండగా.. భార్య శ్వేత (33) గృహిణి.

హైదరాబాద్ లింగంపల్లి హెచ్‌ఎంటీ టౌన్‌షిప్‌ చింతల్‌ చంద్రానగర్‌లో వీరు నివాసం ఉంటున్నారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో.. అత్తింటికి వెళ్లి రావాలని భావించిన శ్వేత ఈ విషయాన్ని భర్తకు చెప్పారు. దీంతో భర్త వెంకటేష్‌.. ఆదివారం భార్య, పిల్లలను లింగంపల్లి స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. ఆ తర్వాత ఆయన తన పనికి వెళ్లిపోయాడు.

అయితే.. వాస...