భారతదేశం, సెప్టెంబర్ 8 -- కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ బీఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పత్రికలలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ప్రకటన ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరంలోని మలన్న సాగర్ నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారన్నారు. మల్లన్నసాగర్ దగ్గర ప్రారంభోత్సవం చేయకుండా గండిపేట దగ్గర మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారన్నారు.

గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీరు కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేసిందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ప్రచారం చేశారన్నారు. 94వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీ...