భారతదేశం, నవంబర్ 2 -- ఆ రోజు రానే వచ్చింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ ను తొలిసారి ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఇండియా ఆదివారం (నవంబర్ 2) నవీ ముంబైలో జరగనున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలిసారి మహిళల ఐసీసీ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం టీమిండియాను ఊరిస్తోంది.

సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై 339 పరుగుల రికార్డు ఛేదనతో అద్భుత విజయం సాధించిన ఇండియా జట్టు ఉత్సాహంతో ఉంది. అయితే, బలమైన దక్షిణాఫ్రికా జట్టు అడ్డుగా నిలవడంతో అసలు పని ఇంకా మిగిలే ఉంది. ఈ ఎనిమిది జట్ల టోర్నమెంట్‌లో సౌతాఫ్రికా ఇప్పటివరకు అద్భుతంగా ఆడింది. గౌహతిలో జరిగిన మరో సెమీ-ఫైనల్‌లో 2017 ఛాంపియన్ ఇంగ్లండ్‌ను సునాయాసంగా ఓడించింది.

భారత్, దక్షిణాఫ్రికా రెండు జట్లూ తమ తొలి ప్రపంచ కప్ ...