భారతదేశం, మే 10 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన తుడరుమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కేరళలో భారీ వసూళ్లను దక్కించుకుంటోంది. తెలుగులోనూ విడుదలైన ఈ మూవీకి మంచి కలెక్షన్లే వస్తున్నాయి. తాజాగా తుడరుమ్ చిత్రం హిస్టరీ క్రియేట్ చేసింది.

తుడరుమ్ సినిమా చరిత్ర సృష్టించింది. కేరళలో ఒక్కటే రూ.100కోట్ల కలెక్షన్ల మార్క్ సాధించిన తొలి మూవీగా ఈ చిత్రం రికార్డు దక్కించుకుంది. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఇప్పటి వరకు 2018 చిత్రం ఉండేది. ఆ మూవీ కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.89కోట్లను రాబట్టింది. ఇప్పుడు తడురుమ్ చిత్రం ఆ రికార్డును బద్దలుకొట్టింది. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

తుడరమ్ సిన...