భారతదేశం, మే 15 -- కడపలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండిపోయేలా నిలిచి పోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో మహానాడు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

మే 27, 28, 29వ తేదీల్లో జరుగుతున్న మహానాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు అని చంద్రబాబు వివరించారు. గతంలో రాయలసీమలో తిరుపతి వంటి చోట్ల మహానాడు నిర్వహించినా....కడపలో తొలిసారి నిర్వహిస్తున్నామని చెప్పారు.

అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని 2024లో అధికారంలోకి వచ్చామని, ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో పార్టీ వ్యవహరాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, భవ...