భారతదేశం, డిసెంబర్ 22 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కు ఎండ్ కార్డు పడింది. ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి గ్రాండ్ ఫినాలే ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ విజేతగా నిలిచాడు. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టిన అతను ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఆమె రెమ్యునరేషన్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.

తనూజ రెమ్యునరేషన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో తనూజ ఆటతోనూ, అందంతోనూ ఆకట్టుకుంది. కానీ ఫినాలేలో కల్యాణ్ కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తనూజ అదరగొట్టింది. తనూజాకు వారానికి రూ.2.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అందించారు. మొత్తం 15 వారాలకు కలిపి రూ.37 లక్షల 50 వేలు ఆమె ఖాతాలో వేసుకుంది.

ప్రైజ్ మనీ కంటే ఎక్కువ...