Hyderabad, జూన్ 14 -- పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి వెళ్ళిపోక తప్పదు. చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంప్రదాయాలని పాటిస్తూ ఉంటారు. మరణం తర్వాత చనిపోయిన వ్యక్తి నోట్లో గంగాజలం, తులసి ఆకుల్ని వేస్తారు. దాని వెనుక కారణం ఏంటి? శాస్త్రం ఏం చెప్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గంగాజలం పవిత్రతకు చిహ్నం. తులసి విష్ణువుతో అనుబంధాన్ని కలిగి ఉంటుందని భావించబడుతుంది. అందుకే రెండిటినీ చనిపోయిన వ్యక్తి నోట్లో వేస్తారు. దాని వలన చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

ఎప్పుడైనా మనం ఏదైనా పూజ చేసినప్పుడు, పూజ సామాగ్రితో పాటుగా పూజ చేసే వారిపై కూడా నీరు జల్లి శుద్ధి చేస్తారు. అన్ని జలాల్లో గంగాజలం పవిత్రమైనది. గంగానదిని "స్వర్గనది" అని కూడా అంటారు. ఇది విష్ణువుని పాదాల నుంచి ఉద్భవించింది, శివుడి శర...