భారతదేశం, నవంబర్ 22 -- ఓటీటీలోకి ఉత్కంఠ రేపుతూ, అదిరిపోయే థ్రిల్ పంచే తమిళ సినిమా దూసుకొస్తోంది. కొత్త పాయింట్ తో తెరకెక్కిన 'ఆర్యన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫామ్ అయింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ నెలలోనే డిజిటల్ డెబ్యూ చేయనుంది. మరి ఆర్యన్ సినిమా ఏ ఓటీటీలోకి? ఎప్పుడు? వస్తుంది, మూవీ స్టోరీ ఏంటీ? అన్నది ఇక్కడ చూసేయండి.

తమిళ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇదే జోనర్లో తెరకెక్కిన ఆర్యన్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆర్యన్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ (నవంబర్ 22) అనౌన్స్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆర్యన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స...