Hyderabad, సెప్టెంబర్ 10 -- టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ సోమవారం (సెప్టెంబర్ 8) తన సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించిన విషయం తెలుసు కదా. తను ఒక యాక్సిడెంట్ లో చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆమె చెప్పింది. ఇక ఇప్పుడు బుధవారం (సెప్టెంబర్ 10) ఆమె ముంబైలో కనిపించింది. కెమెరాలకు పోజులిచ్చింది.

కాజల్ ముంబైలో ఒక సెలూన్‌కు వెళ్తూ కనిపించింది. అక్కడ ఆమె కోసం వెయిట్ చేస్తున్న ఫొటోగ్రాఫర్లు ఆమెను ఎలా ఉన్నారని అడిగారు. చాలా రోజులుగా కనిపించలేదు.. కాస్త కెమెరాకు పోజులివ్వాలని రిక్వెస్ట్ చేయడంతో ఆమె సరే అని చెప్పింది.

ఒక బ్లాక్ ట్యాంక్ టాప్, సీక్విన్ డిటైలింగ్ ఉన్న జీన్స్ వేసుకుని కాజల్ కొన్ని ఫోటోలకు పోజులు ఇచ్చింది. సెలూన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక అభిమానితో ఫొటోలకు పోజు ఇవ్వడం విశేషం. అక్కడి నుంచి వ...