భారతదేశం, జూలై 11 -- అంతర్జాతీయ విద్యను అభ్యసించాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు గుడ్​ న్యూస్​!. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా యూరోపియన్ యూనియన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎరాస్మస్+ (Erasmus+) అనే స్కాలర్‌షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలున్న 19 యూరోపియన్ దేశాల్లో ట్యూషన్ ఫీజు లేకుండా చదువుకోవచ్చు! కొన్ని సందర్భాల్లో వీసా, ప్రయాణం, వసతి, బీమా వంటి అదనపు గ్రాంట్‌లతో పాటు నెలకు 1,400 యూరోలు (సుమారు Rs.1.4 లక్షలు) వరకు స్టైపెండ్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

ఈ ప్రోగ్రామ్​ యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్​షిప్​ ఎడ్యుకేషనల్​ ఎక్స్​ఛేంజ్​ పథకంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అంతర్జాతీయ అనుభవాన్ని, అద్భుతమైన విద్యా అవకాశాలను, సాంస్కృతిక బదిలీని అందించడం దీని లక్ష్య...