భారతదేశం, ఏప్రిల్ 19 -- కంచ గచ్చిబౌలి భూవివాదంపై రీట్వీట్ చేసి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. హెచ్సీయూ భూముల విషయంపై హాయ్ హైదరాబాద్ పోస్టు చేసిన యానిమేటెడ్ పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ అంశంలో ఆమెకు ఈ నెల 12న పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. విచారణకు హాజరై, పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు.

చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను రీపోస్టు చేసినట్లే మరో రెండు వేల మంది చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటారా? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? లేదా కొందరిని సెలెక్టివ్ గా టార్గెట్‌ చేస్తున్నారా? అని స్మితా సభర్వాల్‌ ప్రశ్నించారు. క...