భారతదేశం, ఏప్రిల్ 18 -- యూట్యూబ్ లో కొత్త సాంగ్ రచ్చరచ్చ చేస్తోంది. రవితేజ హీరోగా యాక్ట్ చేస్తున్న 'మాస్ జాతర' సినిమాలోని న్యూ సాంగ్ లేటెస్ట్ సెన్సేషన్ గా మారింది. 'తు మేరా లవర్ లవర్' సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. ప్రస్తుతం సాంగ్స్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ పాట కోసం చనిపోయిన చక్రి గొంతును ఏఐ సాయంతో రీక్రియేట్ చేయడం విశేషం. ఏప్రిల్ 14న రిలీజైన ఈ సాంగ్ కు ఇప్పటివరకూ (ఏప్రిల్ 18 ఉదయం) 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

రవితేజ లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' నుంచి రిలీజైన లిరికల్ సాంగ్ 'తు మేరా లవర్ లవర్' మాస్ బీట్ తో సాగుతోంది. ఈ పెప్పీ సాంగ్ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. అంతేకాకుండా రవితేజ ఫేమస్ మూవీ ఇడియట్ నుంచి ఎంతో వైరల్ అయిన 'చూపుల్తో గుచ్చి గుచ్చి సాంగ్' ట్యూన్ ను ఈ సాంగ్ లో వాడారు. ఇక ఆ పాటలోని ఐకానిక్ స్టెప్స్ తో రవితేజ మర...