భారతదేశం, జూలై 30 -- ఇటీవలి వైద్య పరిశోధనలు, ప్రముఖ కార్డియాలజిస్టుల హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారంలో భాగంగా తీసుకుంటున్న చక్కెర ఒక నిశ్శబ్ద కిల్లర్‌గా మారి, ఊబకాయం, అవయవ నష్టం, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలకు కారణమవుతోందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ముందుగా ఆహారంలో నుంచి చక్కెరను తీసేస్తారు. చక్కెర కేవలం బరువు తగ్గడానికి మాత్రమే అడ్డు కాదని, అది మన శరీరానికి చాలా పెద్ద ప్రమాదమని మీకు తెలుసా? ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ భామ్రి.. జులై 23న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చక్కెర మన ఆరోగ్యాన్ని ఎలా నిశ్శబ్దంగా నాశనం చేస్తుందో వివరించారు. "మీ ఇన్సులిన్‌ను అమాంతం పెంచడం దగ్గర్నుంచి, మీ ధమనులను దెబ్బతీయడం వరకు, ఈ తియ్యటి పదార్థం మీరు అనుకున్నదానికంటే ఎక్కువ హాని చే...